తెలంగాణలో ఎసఐఆర్..
` ఏప్రిల్, మే నెలల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం
` రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో సుదర్శన్‌రెడ్డి సమావేశం
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కోసం ఏప్రిల్, మే నెలల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఎలక్టోల్ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎసఐఆర్ కోసం ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని సీఈవో వెల్లడించారు. సన్నాహక చర్యల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో సుదర్శన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించు?కోవాలని తెలిపారు. ఎసఐఆర్ కోసం రాజకీయ పార్టీల బీఎలఏలు, బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణలో కచ్చితత్వం, పారదర్శకత, సమస్యల సకాల పరిష్కారం కోసం స్థానికులనే బీఎలఏగా నియమించాలని సూచించారు. ప్రస్తుతం 2025 జాబితాలోని ఓటర్లను 2002 ఎసఐఆర్‌లో నమోదైన ఓటర్లతో అనుసంధానించేలా టేబుల్ టాప్ మ్యాపింగ్‌తో పాటు.. క్షేత్రస్థాయి మ్యాపింగ్ కొనసాగుతోందన్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసాలను గుర్తించి ధ్రువీకరించేందుకు బీఎలఓలు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నట్లు సీఈవో వివరించారు. ఎసఐఆర్ సమయంలో ప్రతీ పోలింగ్ ప్రాంతాన్ని బీఎలఓలు మూడు, నాలుగు సార్లు సందర్శిస్తారని తెలిపారు. మొదట వెళ్లినప్పుడు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారు. అందుబాటులో లేని కుటుంబాలను ధ్రువీకరించేందుకు మరోసారి వెళ్తారన్నారు. సన్నాహక దశలో మ్యాపింగ్ కాకపోయిన ఓటర్లు కూడా ఎసఐఆర్ సమయంలో తమ వివరాలు సమర్పించుకునే అవకాశం ఉంటుందని సీఈఓ స్పష్టం చేశారు. బూత్ స్థాయిలో రాజకీయ పార్టీలు భాగస్వామ్యమైతే ఫిర్యాదులను తగ్గించి.. అర్హులైన ఓటర్లు జాబితా నుంచి మిస్ కాకుండా ఉంటారని పేర్కొన్నారు.



