మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ సంబంధించిన వివిధ వాడలకు చెందిన బిఆర్ఎస్ నాయకులు పలువురు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలోనే మంథని పట్టణ అభివృద్ధి సాధ్యమని.. ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు ఈ సందర్భంగా తెలియజేశారు.


