గ్రూప్`1 నియామకాలు సక్రమమే..
` సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన హైకోర్టు ధర్మాసనం
` ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ భారీ ఊరట
` అభ్యర్థులకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ నేతత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో.. గ్రూప్ 1 నియామకాలపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను పునః మూల్యాంకనం చేయాలని నాడు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు హైకోర్టులో పిల్ వేశారు.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుది తీర్పునకు లోబడి గ్రూప్ 1 నియామకాలు చేపట్టవచ్చని ఇప్పటికే గతంలో ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసింది.
అభ్యర్థులకు సిఎం అభినందన
గ్రూప్ `1 నియామకాల అంశంలో హైకోర్టు తీర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. గ్రూప్`1 నియామకాలపై హైకోర్టు తీర్పును హదయ పూర్వకంగా స్వాగతిస్తున్నామన్నారు. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని.. ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా.. వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామని తెలిపారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ `1 అభ్యర్థులకు అభినందనలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ `1 అధికారులుగా విÖరు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిస్తున్నానని పేర్కొన్నారు. కాగా.. గ్రూప్ `1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గ్రూప్`1 నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది సీజే ధర్మాసనం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్ళీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో ఉత్తర్వులు ఇచ్చింది సీజే బెంచ్.. ఇప్పటికే 562 మందికి తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. ఈ తీర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.



