అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో భారత్ పరపతి పెరిగింది

` ఈ ట్రేడ్ డీల్‌తో భారత్ మరింత బలం పుంజుకుంది
` దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు
` దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది
` ప్రపంచ దేశాలు స్వాగతం పలుకుతున్నాయి..
` కాంగ్రెస్‌కు దూరదష్టి లేదు ` రాజ్యసభలో ప్రధాని మోదీ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. అమెరికాతో ట్రేడ్ డీల్ తర్వాత భారత్ బలం మరింత పెరిగిందన్నారు. ఈ ఒప్పందం తర్వాత మన యువతకు ఎక్కువ లబ్ధి జరగనుందని, ప్రపంచ దేశాలన్నీ స్వాగతం పలుకుతున్నాయని తెలిపారు. గతంలో ఇండియాతో ఒప్పందానికి పలు దేశాలు ముందుకొచ్చేవి కావన్నారు. రిఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ మంత్రంతో దూసుకెళ్తున్నామన్నారు. అన్ని విషయాల్లో పోటీ పడేందుకు భారత్ ఇప్పుడు సిద్ధంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. “దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు. దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది. యూపీఏ హయాంలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే.. ఎన్డీయే హయాంలో మూడో స్థానానికి చేరుకోనుంది. ప్రపంచంలో భారత్ పరపతి పెరుగుతోంది. గతంలో మనతో ఒప్పందానికి పలు దేశాలు ముందుకొచ్చేవి కావు. ఇప్పుడు అభివద్ధి చెందిన దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. భారత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈయూ కూటమితో అనేక ఒప్పందాలు చేసుకున్నాం. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అమెరికాతో ట్రేడ్ డీల్ తర్వాత భారత్‌కు మరింత బలం పెరుగుతుంది. మన యువతకు ఎక్కువ లబ్ధి జరగనుంది.కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి దూరదష్టి, ఎటువంటి ప్రణాళిక లేదన్నారు. తనతోపాటు ఓ వర్గంపైనా ద్వేషాన్ని పెంచుకుంటోందన్నారు. ఇటీవల లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. దీనిపై లోక్‌సభలో చర్చ జరగకపోవడం అత్యున్నత పదవికే అవమానకరమన్నారు.తయారీ రంగంలో బలమైన ఎకో సిస్టమ్ ఉంటేనే ఒప్పందాలకు ముందుకొస్తారు. రిఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్.. నినాదంతో దూసుకెళ్తున్నాం. అన్ని విషయాల్లో పోటీ పడేందుకు భారత్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. అనేక దేశాల్లో వద్ధుల సంఖ్య పెరుగుతుండగా.. మనదగ్గర యువత జనాభా అధికంగా ఉంది. మన యువతకు ప్రపంచ దేశాలన్నీ స్వాగతం పలుకుతున్నాయి.
ఎన్నో సంస్కరణలు తెచ్చాం..
బ్యాంకుల బలోపేతానికి అనేక సంస్కరణలు తెచ్చాం. ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా నిలిచాం. బ్యాంకుల నుంచి ఇప్పుడు పేదలకు రుణాలు అందుతున్నాయి. ముద్ర యోజన ద్వారా అనేక మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. దీని కింద రూ.30లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం. 10కోట్ల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు లబ్ధి పొందారు. 2014 తర్వాత ప్లానింగ్ కమిషన్‌ను తీసేసి నీతిఆయోగ్‌ను తెచ్చాం. ఇది వేగంగా, సమర్థంగా పనిచేస్తోంది.
చొరబాటుదారులను రక్షిస్తున్నారు..
అక్రమార్కులను రక్షించేందుకు బెంగాల్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయిస్తోంది. అభివద్ధి చెందిన దేశాలు కూడా అక్రమ వలసదారులను బయటకు పంపించివేస్తున్నాయి. బెంగాల్‌లో మాత్రం అటువంటి వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజల హక్కులు హరిస్తున్నారు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

తాజావార్తలు