న్యాయవాదిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

 

 

 

 

 

 

చేర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరణ

చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 05 : చేవెళ్ల కోర్టులో న్యాయవాది స్వప్నను దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ గురువారం చేర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిఫ్ కోర్టు ఎదుట న్యాయవాదులు విధులు బహిష్కరించి నల్ల బ్లడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరేళ్ల వీరమల్లయ్య మాట్లాడుతూ.. న్యాయవాదులపై రోజురోజుకు అనేక దాడులు జరుగుతున్నాయని, న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చేవెళ్లలో యువ న్యాయవాదిని హత్య చేసిన నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును విచారించి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు భూమిగారి మనోహర్, ఆరేళ్ల మహేందర్, ప్రధాన కార్యదర్శి తాటికొండ ప్రణీత్, బూరుగు యాదగిరి గౌడ్, పొన్నం సురేష్ కృష్ణ, పర్వతం రాములు, అంకని సురేందర్, నల్లగొండ సంతోష్ తదితరులు ఉన్నారు.