అఫ్జల్ ఖాన్ నూతన గృహ ప్రవేశ వేడుకల్లో మంత్రి
మల్లారెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి :
ఆదివారం శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, ఆయన సోదరుడు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్ ల గృహ ప్రవేశ వేడుకలో మేడ్చల్ ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతు.. అహర్నిశలు పార్టీ కోసం పాటుపడుతూనే , సామాజిక, సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న అఫ్జల్ ఖాన్ కు మున్ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని, త్వరలో అఫ్జల్ ఖాన్ కు మంచి పదవి రావచ్చని అన్నారు. అఫ్జల్ ఖాన్ కు ఎల్లవేళలా అండదండ గా ఉంటానని మల్లారెడ్డి తెలిపారు. ఈ గృహ ప్రవేశ వేడుకలో మంత్రి మల్లారెడ్డి, అఫ్జల్ ఖాన్, మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్ తో పాటు ఎంపిపి దాసరి ఎల్లుబాయి బాబు, మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్, మాజీ సర్పంచ్ బత్తుల కిషోర్ యాదవ్, ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్, నాయకులు వంగ వెంకట్ రెడ్డి, కంఠం క్రిష్ణా రెడ్డి,దండుగుల మైసయ్య, చాంద్ పాషా, మహ్మద్ ఇస్మాయిల్ ఖాన్,మహ్మద్ గౌస్,ఉమ్మర్ , పి నర్సింహ రెడ్డి,దాసరి బాబు, మహ్మద్ ఇర్ఫాన్, మేడి రవి, పవన్ ముదిరాజ్, గొలుసుల విష్ణు, తదితరులు పాల్గొన్నారు.
12ఎస్పీటీ -1: మంత్రి ని సన్మానిస్తున్న అఫ్జల్ ఖాన్