అభినయ నృత్యనికేతన్‌ విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో 16 బహుమతులు
శ్రీకాకుళం, జూలై 18: నాట్యరవళి రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో శ్రీకాకుళం పట్టణానికి చెందిన అభినయ నృత్య నికేతన్‌ విద్యార్థినులు 16 బహుమతులను కైవసం చేసుకున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర కేంద్రబిందువైన విశాఖపట్నంలోని నాట్య రవళి డాన్స్‌, మ్యూజిక్‌ అకాడమీ ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ఆరధ్ర, ఒడిశా, కర్నాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి సుమారుగా 725 మంది నృత్య కళాకారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన అభినవ నృత్య నికేతన్‌ విద్యార్థులు వివిధ విభాగాల్లో 16 బహుమతులు సొంతం చేసుకున్నట్లు సంస్థ డైరెక్టర్‌ నీరజాసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ పోటీల్లో కె.రామలక్ష్మి, కె.ఎస్‌.హర్షిత, కె.నాగలక్ష్మి, కె.రామలక్ష్మి, కె.హర్షిత, కె.అపూర్వ, కె.కోమలి, జె.శ్రీహ, వి.విజయలక్ష్మి, ఎం.కరుణ, కె.కె.ఎస్‌.మేఘన, ఎన్‌.భవ్యకీర్తి, సంహితలు, జి.శ్వేతశ్రీ బహుమతులు పొందారని డైరెక్టర్‌ నీరజాసుబ్రహ్మణ్యం తెలిపారు.