నీట్‌కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ తీర్మానం
నీట్ పరీక్ష కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్ణాటక మెడికల్ ఎడ్యుకేషన్ & స్కిల్ డెవలప్ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్‌బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కొన్ని రోజుల క్రితమే కర్ణాటక క్యాబినెట్ నిర్ణయించింది.కర్ణాటక క్యాబినెట్ నీట్ రద్దుపై నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఈ నెల 23న నీట్ రద్దును కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానం బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో అవకతవకలు బయటపడంతో నీట్ నిర్వహణపై అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నీట్‌ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త విధానం తీసుకురావాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.