కొల్చారం ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
జనం సాక్షి/ కొల్చారంజిల్లా వైద్యాధికారి శ్రీరామ్కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్ సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు, మందుల నిల్వలను వారి పరిష్కరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, సరైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. గ్రామాలలో పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు