ఉపాధి కోసం ఉద్యమ బాట.. నేతన్నల మానవహారం

సిరిసిల్ల. జులై 25. (జనంసాక్షి).

పట్టణ పట్టణ బంద్ విజయవంతం.

నాలుగో చేరిన దీక్షలు.

సంఘీభావం తెలిపిన సిపిఐ, సిపిఎం నాయకులు చాడ, స్కైలాబ్ బాబు.ఉపాధి కల్పించాలని కోరుతూ సిరిసిల్ల నేతన్నలు ఉద్యమ బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేతన్న విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. నిరసనలో భాగంగా చేపట్టిన సిరిసిల్ల పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వస్త్ర పరిశ్రమ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరవధిక దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. శిబిరాన్ని సందర్శించిన భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చాడ వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరం నుండి నేతన్న విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లిన నేతన్నలు మానవ హారం ఏర్పాటుచేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు తప్పెట్ల స్కైలాబ్ బాబు మాట్లాడుతూ నేతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చేయూత అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులు మాఫీ చేసి తక్షణం కార్మికుల ఉపాధికి చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపాధి కోసం నేతన్నలు చేసిన నినాదాలతో పాత బస్టాండ్ దద్దరిల్లిపోయింది. తమ నిరసనలో భాగంగా వస్త్ర పరిశ్రమ జేఏసీ నాయకులు ఇచ్చిన పట్టణ ప్రశాంతంగా జరిగింది. కార్యక్రమంలో వస్త్ర పరిశ్రమ జేఏసీ నాయకుల మూశం రమేష్, కోడం రమణ, గణేష్, దూడం శంకర్, గోవిందు రవి, మండల సత్యం, ఉడుత రవి, పంతం రవి తదితరులు పాల్గొన్నారు.