33 రకాల వరి పంటలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించాం
తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. 33 రకాల వరి పంటలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.‘తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతున్నది. పండిన పంటకు సరైన ధర రాక, పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి, వాటిని పండించిన రైతుకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల సన్న రకం వరి సాగు విస్తీర్ణం పెరిగి, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.