ఏపీ,బీహార్‌కు బడ్జెట్‌లో పెద్దపీట
` కొన్ని మెరుపులు..మరికొన్ని విరుపులు..
` కొన్ని ఆశలు..మరికొన్ని ఆకాంక్షలు
` 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్
` వ్యవసారంగానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం
` నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై దృష్టి
` స్థూలంగా బడ్జెట్ పరిమాణం రూ.48.21 కోట్లు
` మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
` పన్ను ఆదాయంఅంచనా రూ.28.83 లక్షల కోట్లు
` ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా
` అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు
` అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేటాయింపు
` పోలవరం పూర్తికి హామీ
` బీహార్‌లో మౌళిక వసతుల కల్పనలకు భారీగా కేటాయింపులు
` బంగారం, ఫోన్స్ యాక్సరీస్‌పై సుంకాలు తగ్గింపు
న్యూఢల్లీి(జనంసాక్షి):కొన్ని మెరుపులు..మరికొన్ని విరుపులు.. కొన్ని ఆశలు..మరికొన్ని ఆకాంక్షలతో ఎప్పటిలాగే ఉద్యోగుల ఇన్‌కమ్ ట్యాక్స్‌పై పెద్దగా సడలింపులు లేకుండా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను ఎంపిక చేసుకుంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన` నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన` ఆవిష్కరణలు, తయారీ`సేవలు, తర్వాత తరం సంస్కరణలు` ఈ తొమ్మిది అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ.. ఈ అంశాలను ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్‌రూపకల్పన చేసినట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ,సేవలు, తర్వాతతరం సంస్కరణలు.. ఈ తొమ్మిది సూత్రాల ప్రాధాన్యంగా తీసుకుని బడ్జెట్ రూపొందించినట్లు తన ప్రసంగంలో విత్త మంత్రి ప్రకటించారు. ఇక ఈ బడ్జెట్ మొత్తంలో వివిధ రంగాలన్నింటికి కలిపి రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అంటే స్థూలంగా బడ్జెట్ పరిమాణం రూ.48.21 కోట్లు. ఇందులో మొత్తం ఆదాయాన్ని రూ.32.07 లక్షల కోట్లుగా, దానిలో పన్ను ఆదాయాన్ని రూ.28.83 లక్షల కోట్లుగా చూపించారు. ఈ ఏడాది ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా అంచనా కట్టారు. అదేవిధంగా నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్‌లో రైతులు,యువతపై ఎక్కువ దృష్టి పెట్టారు. యూత్ కు 2 లక్షల కోట్లు కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. మొబైల్స్, బంగారంపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. ఆదాయపు పన్ను శ్లాబులను సవరించారు. అయితే ఉద్యోగస్థులకు పెద్దగా ఉరట కల్పించలేక పోయారు. టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు 12 నెలల ఇంటర్న్ ఫిప్ అవకాశాలు కల్పించేనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్న్ షిప్ భత్యంగా నెలకు రూ.5000, వన్ టైమ్ అసిస్టెన్స్ కింద రూ. 6000 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక కంపెనీలు ఇంటర్న్ షిప్ వ్యయంలో 12 శాతం భరించాల్సి ఉంటుంది. బీహార్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. బీహార్ లో విమానాశ్రయాలు, మెడికల్ కాలేజ్ లు, క్రీడల మౌలిక వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీహార్, రaార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆందప్రదేశ్ రాష్టాల్రను అభివృద్ధి పరుస్తామన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15000 కోట్లను కేటాయించారు. మొబైల్ ఫోన్లపై, యాక్ససెరీలపై, ఛార్జర్స్ పై 15 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. ఉన్నత విద్య, దేశీయ సంస్థలకు రూ. 10 లక్ష ల కోట్లు కేటాయించారు. ఇకపోతే స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) లోటు 4.9 శాతం ఉండగలదన్నారు. 2025`26 ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం ఆర్థిక లోటుకే చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వచ్చే రెండేళ్లలో కోటిమంది రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. కూరగాయల ఉత్పత్తి పెద్దఎత్తున చేపట్టేలా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా కేటాయింపులు చేశారు. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయంలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయంలో స్థిరమైన పద్ధతులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి పెంపుదలపై దృష్టి సారించామని.. ఆ దిశగా కార్యక్రమాలు చేపడతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు.అంతేకాదు.. వాతావరణ పరిస్థితులను తట్టుకునే, అధిక దిగుబడినిచ్చే ఉద్యానవన పంటలకు సంబంధించి 109 కొత్త వంగడాలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యసాయ రంగానికి కేటాయించిన రూ. రాష్టాల్ర భాగస్వామ్యంతో ప్రభుత్వం వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ను ప్రోత్సహిస్తుందని ప్రకటించారు. ఇక గ్రావిూణాభివృద్ధి కోసం రూ. 2.66 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయ ఉత్పాదతకు పెంపొందించడానికి, వాతావరణాన్ని తట్టుకోగల రకాలను అభివృద్ధి చేయడానికి వ్యవసాయ పరిశోధన శాలను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం సమగ్ర సవిూక్ష చేస్తుందన్నారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బ్జడెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. నూనెగింజల ఉత్పత్తి కోసం ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయ విలువను పెంచడం దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మద్దతుతో పంట అనంతర కార్యకలాపాలలో పెట్టుబడులను ప్రోత్సహించడం, పాడి రైతులకు సాధికారత, నానో`డిఎపిని అన్ని వ్యవసాయ`వాతావరణ మండలాలకు విస్తరించడం, 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కుల ఏర్పాటు, ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడానికి బ్లూ ఎకానవిూ 2.0 ప్రారంభం, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అమలును వేగవంతం చేయడం, 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. చిన్న రైతును దృష్టిలో ఉంచుకుని ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టారు. చిరు ధాన్యాలను పండిరచడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడంపైనా ఫోకస్ పెట్టింది.భారతదేశ వ్యవసాయ రంగం వారసత్వ సమస్యలలో కొట్టుమిట్టాడు తూనే ఉంది. ఇప్పటికీ దేశ జనాభాలో అధిక శాతం మంది ప్రజలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినప్పటికీ, వ్యవసాయం సమర్థత లోపించి తక్కువ ఆదాయ వృత్తిగా మిగిలిపోయింది. వ్యవసాయ ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు వాణిజ్యీకరణ, వైవిధ్యీకరణ దిశగా పయనించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతి ప్రజలుపై ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశ వ్యాప్తంగా 4.1 కోట్ల మంది యువతీ, యువకులకు లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ రంగాలపై దృష్టి సారిస్తుందని సీతారామన్ చెప్పారు. ఈ రంగాలలో పథకాలు, చర్యలు ` ప్రస్తుతం ఉన్నవి, ప్రకటించబోయేవి అన్నింటికి కలిపి ఐదు సంవత్సరాల వ్యవధిలో రూ. 2 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ªూనున్న ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎగుమతులు, ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో బీహార్, ఆంధ్రప్రదేశ్‌లకు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో బుద్ధగయ, రాజ్‌గిర్, వైశాలి, దర్భంగాలలో రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. బీహార్‌లో వివిధ రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.26,000 కోట్లను బడ్జెట్ ప్రతిపాదించింది. బీహార్‌కు బహుపాక్షిక అభివృద్ధి సంస్థల సహాయంతో ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పారు. బీహార్‌లో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడిరచారు. బీహార్‌లోని పీర్‌పైంటిలో 2400 మెగావాట్ల కొత్త పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ ప్రాజెక్టులను రూ.21,400 కోట్లతో చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హావిూలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్ర రాజధాని ఆవశ్యకతను గుర్తించి, బహుపాక్షిక ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 15,000 కోట్లు కేటాయించబడతాయన్నారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు సమకూర్చి పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ క్రమంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధప్రదేశ్‌ల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం ’పూర్వోదయ’ పథకాన్ని కూడా తీసుకురానుంది. తూర్పు ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని సీతారామన్ చెప్పారు.
రైల్వేకు పెద్దపీట
` రూ.2.62 లక్షల కోట్లు..
` ‘కవచ్’పై దృష్టి సారిస్తాం
` రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్
దిల్లీ(జనంసాక్షి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయింపులు జరిపినట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.ఈ మొత్తంలో రైల్వేలో భద్రతా వ్యవస్థల మెరుగు, కవచ్ ఇన్‌స్టలేషన్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. బడ్జెట్‌లో రైల్వేకు సంబంధించిన కేటాయింపులపై విలేకరులతో మాట్లాడారు.బడ్జెట్‌లో రైల్వేకు ఎప్పుడూ లేని విధంగా రూ.2,62,200 కోట్లు కేటాయించినట్లు అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ఇందులో రూ.1.08 లక్షల కోట్లు రైల్వే భద్రతకు వినియోగించనున్నట్లు తెలిపారు. పాత ట్రాకుల స్థానే కొత్తవి ఏర్పాటు, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, కవచ్ వ్యవస్థ ఇన్‌స్టలేషన్ ఇందులో ఉన్నాయన్నారు. అన్నింటిలో కల్లా కవచ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇటీవలే కవచ్ 4.0కు ఆమోదం లభించిందని, ఇన్‌స్టలేషన్ త్వరతిగతిన చేపడతామని వెల్లడిరచారు.
మోదీ హయాంలోనే అధికం
ప్రస్తుతం అధికారంలో ఉన్న మోదీ సర్కారుకు, యూపీఏ హయాంలో రైల్వేకు కేటాయింపులను ఈ సందర్భంగా అశ్వనీ వైష్ణవ్ ప్రస్తావించారు.2014లో రైల్వేకు రూ.35 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, ఇప్పుడు ఆ మొత్తం రూ.2.62 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.2014కు ముందు గడిచిన 60 ఏళ్లలో 20 వేల కిలోవిూటర్ల రైల్వే మేర రైల్వే మార్గం విద్యుదీకరించగా.. గడిచిన పదేళ్లలోనే 40 వేల కిలోవిూటర్లను పూర్తి చేసినట్లు తెలిపారు.2014లో సగటున రోజుకు 4 కిలోవిూటర్ల మేర ట్రాకుల నిర్మాణం జరగ్గా.. ఇప్పుడు సగటున రోజుకు 14.5 కిలోవిూటర్ల ట్రాకులు నిర్మితమవుతున్నాయని చెప్పారు.మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని ఒక్కో రైలులో మూడిరట రెండొంతులు సాధారణ కోచ్‌లు, ఒక వంతు ఏసీ కోచ్‌లు ఉండేలా చూస్తున్నట్లు వైష్ణవ్ చెప్పారు.జనరల్ కోచ్‌లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2,500 అదనపు జనరల్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నామని, మరో 10వేల సాధారణ కోచ్‌ల తయారీ చేపట్టనున్నామని చెప్పారు. ఈ రెండిరటికీ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినట్లు తెలిపారు.యూపీఏ హయాంలో రైల్వే పరిధిలో 4.11 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించగా.. మోదీ హయాంలో గడిచిన పదేళ్లలో 20 శాతం అధికంగా ఉద్యోగ కల్పన జరిగిందని అశ్వనీ వైష్ణవ్ చెప్పారు.
అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా బడ్జెట్
రైతులు, పేదలను ఆదుకునేలా ప్రతిపాదనలు
ప్రధాని మోడీ ప్రశంసలు
న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024`25 పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సీతారామన్ పద్దుపై ప్రశంసలు కురిపించారు. మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టం చేశారు. రైతులు, పేదలను దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ ఈ పద్దుని రూపొందించారని వెల్లడిరచారు. ఈ పద్దుతో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని,మధ్య తరగతి వర్గం సాధికారత సాధించే విధంగా ఈ బడ్జెట్ ఉందని తెలిపారు. విద్యారంగంతో పాటు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టినట్టు స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ఎంఎª`లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ని తీసుకురావడం చాలా గొప్ప విషయమని అన్నారు. ’గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ సారి బ్జడెట్ పూర్తిగా మధ్యతరగతి వర్గానికి మేలు చేసే విధంగా ఉంది. విద్య, నైపుణ్యాభివృద్ధిపై బడ్జెట్లో ప్రాధాన్యత దక్కింది. మహిళలు, వ్యాపారులు, ఓªూఓఇలకూ ఊతం అందించే పద్దు ఇది. యువతకు మేలు చేసే విధంగా ప్రత్యేకంగా ఇన్సెంటివ్ స్కీమ్‌ని తీసుకురావడం చాలా గొప్ప విషయం అని అన్నారు. యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కీమ్‌తో లబ్ది చేకూరుతుందని ప్రధాని వెల్లడిరచారు. ఈ పథకంలో భాగంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లకి ఓ నెల జీతం అడ్వాన్స్‌గా ఇస్తారు. అయితే..ఈ డబ్బుని ఖఈ లో జమ చేస్తారు. రూ.లక్షలోపు జీతం ఉన్న వాళ్లు ఈ స్కీమ్‌కి అర్హులుగా కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు గ్రావిూణ ప్రాంతాలకు చెందిన యువత దేశంలోని బడా సంస్థల్లో పని చేసే విధంగా ఈ స్కీమ్ ప్రోత్సహించనుంది. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరవాత ప్రవేశపెట్టిన తొలి బ్జడెట్ ఇది. ఈ పద్దుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే…ఐటీ శ్లాబ్‌ల విషయంలో మాత్రం పెద్దగా ఊరట ఏవిూ దక్కలేదు.
మిత్రపక్షాల బడ్జెట్
` ప్రతిపాదనలపై కాంగ్రెస్ పెదవి విరుపు
` కాపీ పేస్ట్ బడ్జెట్ అంటూ విమర్శలు
` కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టబోయారు
` కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే తదితరుల విమర్శలు
న్యూఢల్లీి(జనంసాక్షి):ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని దుయ్యబట్టారు. ఈబడ్జెట్ తన మిత్రపక్షాలను సంతోషపెట్టేలా ఉందని ఆరోపించారు. ఇతర రాష్టాల్రను పణంగా పెట్టి.. బడ్జెట్‌లో తమ మిత్రపక్షాలకు బూటకపు వాగ్దానాలు చేశారని మండిపడ్డారు. తన స్నేహితులను సంతోషపెట్టడం కోసమే ఈ బడ్జెట్‌ను తీసుకొచ్చారని.. దీని నుంచి అదానీ, అంబానీ ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. ఎప్పట్లాగే ఈసారి కూడా సామాన్య భారతీయుడికి ఎలాంటి ఉపశమనం లభించలేదని చెప్పారు. ఇదొక కాపీ పేస్ట్ బడ్జెట్ అని.. కాంగ్రెస్ మేనిఫెస్టో, గత బడ్జెట్‌లను కాపీ కొట్టారని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ తరహాలోనే.. దీనిని ఓ కాపీ పేస్ట్ బడ్జెట్‌గా అభివర్ణించారు. ఈ మోదీ ప్రభుత్వ కాపీక్యాట్ బడ్జెట్.. కాంగ్రెస్ న్యాయ అజెండాను కూడా సరిగ్గా కాపీ చేయలేకపోయిందని ఖర్గే వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. కూటమి భాగస్వాములను మోసం చేసేందుకు, ఎన్డీఏ మనుగడ సాగిచేందుకు మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అరకొర డబ్బులు పంచుతోందని ఆరోపించింది. ఇది దేశ ప్రగతికి ఉద్దేశించిన బడ్జెట్ కాదని.. మోదీ ప్రభుత్వాన్ని కాపాడే బడ్జెట్ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా ఇదొక కాపీక్యాట్ బ్జడెట్ అని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోని చదివినందుకు నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలను సెటైరికల్ కామెంట్ చేశారు. అప్రెంటిస్‌షిప్ పథకాన్ని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 11వ పేజీ నుంచి తీసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కాపీ కొట్టిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేతలు శశిథరూర్, పి.చిదంబరం అన్నారు. తమ మేనిఫెస్టో నుంచి నిర్మలా సీతారామన్ ’అప్రంటీస్ స్కీమ్’ను కాపీ కొట్టారని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. నిర్మలా సీతారామన్ ’ఇంటెర్న్‌షిప్ స్కీమ్’ను ప్రకటించారు. ఈ స్కీమ్ కింద ఫార్మల్ సెక్టార్‌లో ఫస్ట్‌టైమ్ ఉద్యోగులకు ఒక నెల వేతనం లభిస్తుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు 500 టాప్`కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టే`2024ను ఆర్థిక మంత్రి చదివారని, అందుకు ఆమెను అభినందిస్తున్నానని పి.చిదంబరం సామాజిక మాధ్యమం ’ఎక్స్’లో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 30వ పేజీలో పేర్కొన్న ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెన్టివ్ (ఇఒఎ)ను నిర్మలా సీతారామన్ బ్జడెట్‌లో చేర్చడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పేజ్`11లో చెప్పిన ’ఎంప్రటీస్ స్కీమ్’ను కూడా ఆర్థిక మంత్రి బ్జడెట్‌లో ప్రవేశపెట్టారని చెప్పారు. కాంగ్రెస్ మరికొన్ని ఐడియాలను కూడా బ్జడె?ట్‌లో చేర్చారని ఆయన తెలిపారు. అయితే బ్జడెట్‌లో ’ఏంజెల్ టాక్స్’ను నిర్మలా సీతారామన్ రద్దు చేయడాన్ని ఆయన అభినందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా ’ఏంజెల్ టాక్స్’ను రద్దు చేయాలని కోరుతోందని, కాంగ్రెస్ మేనిఫెస్టో 31వ పేజీలో కాంగ్రెస్ ఇచ్చిన హావిూ ఇదని చెప్పారు. కాగా, సామాన్య ప్రజానీకం సమస్యలపై బ్జడెట్‌లో పరిష్కారం కనిపించలేదని శశిథరూర్ పేర్కొన్నారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఏ ఊసే లేదన్నారు. ఆదాయ అసమానతల పరిష్కారానికి బ్జడెట్‌లో చేసింది కూడా చాలా తక్కువ అని అన్నారు. ఏంజెల్ ఇన్వెస్టర్లపై పన్ను రద్దు చేయడాన్ని మాత్రం తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
బడ్జెట్‌పై నిలదీద్దాం
` పార్లమెంట్‌లో నిరసనకు విపకాలు రెడీ..
` ఈ మేరకు కూటమి నేత సమావేశం
దిల్లీ(జనంసాక్షి): కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కూటమి నేతలంతా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, సంజయ్ రౌత్ తదితరులు హాజరయ్యారు.కేంద్ర మంత్రుల వేతనాలు, అతిథుల ఆతిథ్యానికి రూ.1,248.91 కోట్లు..బడ్జెట్‌పై విపక్ష నేతలు చర్చించారు. దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ వెల్లడిరచారు. ‘‘భాజపా అధికారంలో లేని రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోంది. మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. ఇది భాజపా బడ్జెట్ కాదని.. దేశ బడ్జెట్ అంటూ సమర్థించుకుంటున్నారు. కానీ, దీనిపై రేపు పార్లమెంట్‌లో నిరసన తెలిపాలని కూటమి నిర్ణయం తీసుకుంది. న్యాయం కోసం పోరాడతాం’’ అని ఆయన పేర్కొన్నారు. తమ కుర్చీని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంటూ రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొన్ని రాష్ట్రాల పట్ల మోదీ సర్కార్ వివక్ష చూపుతోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.
ధరలు తగ్గేవి..
` మూడు రకాల క్యాన్సర్ మందులు
` మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు,
` దిగుమతి చేసిన బంగారం, వెండి
` లెదర్ గూడ్స్
` సీఫుడ్, రొయ్యలు, ఫిష్ ఫీడ్,
` ఎక్స్ రే ట్యూబ్‌లు
` ఉక్కు, రాగి
` సోలార్ సెల్స్`ప్యానళ్ల తయారీకి అవసరమైన వస్తువులు,
` 25 రకాల క్రిటికల్ మినరల్స్
` బ్రూడ్‌స్టాక్, పాలీచేటి వార్మ్స్, ష్రింప్,
` మిథైలిన్ డైఫినైల్ డిస్సోసియనేట్(ఎండీఐ)
పెరిగేవి..
` ప్లాస్టిక్ ఐటమ్‌లు,
` పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు,
` సోలార్ గ్లాస్
` టిన్డ్ కాపర్ ఇంటర్‌కనెక్ట్,
` అమ్మోనియం నైట్రేట్