బడ్జెట్‌పై కేసీఆర్ పెదవి విరుపు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై కేసీఆర్ పెదవి విరిచారు.  ఈ బడ్జెట్ ఎవరికి కూడా భరోసా కల్పించేలా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  డబ్బొచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు.  ఏ కొత్త సంక్షేమ పథకాలు బడ్జెట్‌లో లేవని స్పష్టం చేశారు.  మహిళా సంక్షేమం పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉన్నా.. ఏమీ చెప్పలేదన్నారు. మహిళలకు  రుణాలే ఇస్తామన్నారు. అది అల్రెడీ ఉన్న స్కీమేనని గుర్తు చేసారు.  కొత్త ప్రభుత్వం తర్వాత ఆరు మాసాల సమయం ఇవ్వాలని అనుకున్నామని..  ఈ‘అర్భక ప్రభుత్వం’ బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ చేసినట్లుగా కనిపించలేదన్నారు. మ‌హిళ‌ల ప‌ట్ల కూడా చాలా విష‌యాలు స్ప‌ష్టంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉండే. ఏదో కొత్త‌గా ల‌క్ష కోట్ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాలు ఇస్తామ‌ని చెప్పారు. అది ఆల్రెడీ ఉన్న స్కీమే. దుర‌దృష్టం ఏందంటే.. ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ త‌ర్వాత మేం కూడా క‌నీసం 6 నెల‌ల స‌మ‌యం ఇవ్వాల‌నుకున్నాం. నేను కూడా పెద్ద‌గా శాస‌న‌స‌భ‌కు రాలేదు. కానీ ఈ రోజు బ‌డ్జెట్ చూస్తే.. ఏ ఒక్క పాల‌సీ ఫార్ములేష‌న్ జ‌ర‌గ‌లేదు. రాష్ట్రానికి సంబంధించిన‌టువంటి ఏ ఒక్క విష‌యంలో కూడా ఈ అర్బ‌క ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు పాల‌సీ ఫార్ములేష‌న్ చేసిన‌ట్టుగా క‌న‌బ‌డుత‌లేదు అని కేసీఆర్ తెలిపారు.వ్య‌వ‌సాయం విష‌యంలో మాకు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉండే. ఈ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ స్థీరిక‌ర‌ణ జ‌ర‌గాల‌ని, మేం రెండు పంట‌ల‌కు రైతుబంధు ఇచ్చాం. వీళ్లెమో ఎగ్గొడుతామ‌ని చెబుతున్నారు. రైతుల‌కు ఇచ్చిన డ‌బ్బును పాడు చేసినం.. చెడ‌గొట్టినం.. దుర్వినియోగం చేసినం అనే ప‌ద్ధ‌తిలో దుర‌దృష్ట‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శ‌త్రువు ప్ర‌భుత్వం అని తెలుస్తుంది. ధాన్యం కొనుగోలు చేయ‌లేదు. విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డం లేదు. నీళ్లు స‌ర‌ఫ‌రా చేయ‌డం లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతుబంధు, రైతుభ‌రోసా ప్ర‌స్తావ‌నే లేదు. రైతుభ‌రోసా ఎప్పుడు వేస్తార‌ని మా ఎమ్మెల్యేలు అరిస్తే క‌నీసం స‌మాధానం చెప్ప‌డం లేదు. కాబ‌ట్టి రైతుల‌ను ఈ ప్ర‌భుత్వం వంచించింది. వృత్తి కార్మికుల‌ను వంచించింది అని కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఇండ‌స్ట్రీయ‌ల్ పాల‌సీ ఏమిటి..? ఏం లేదు వ‌ట్టిదే గ్యాస్.. ట్రాష్. ఇదేదో స్టోరీ టెల్లింగ్‌లాగా ఉంది త‌ప్ప బ‌డ్జెట్‌లాగా లేదు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయ పాల‌సీ ఏమిటి..? పారిశ్రామిక పాల‌సీ ఏమిటి..? ఐటీ పాల‌సీ ఏమిటి..? ఇంకా ఇత‌ర అనేక పాల‌సీలు.. పేద వ‌ర్గాల‌కు సంబంధించిన పాల‌సీ ఏమిటి..? అనే ఏ ఒక్క‌దాని మీద కూడా స్ప‌ష్ట‌త లేదు. అంత వ‌ట్టిదే గ్యాస్, ట్రాషే. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్లాట్‌ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది త‌ప్ప అది బ‌డ్జెట్ ప్ర‌సంగంలా లేదు. రాజ‌కీయ స‌భ‌ల్లో చెప్పిన‌ట్టుగా ఉంది త‌ప్ప ఏ ఒక్క పాల‌సీని కూడా నిర్దిష్టంగా ఈ ప‌నిని మేం ఇలా సాధిస్తాం.. మా గోల్స్, టార్గెట్స్ ఇవి అనే ప‌ద్ధ‌తి కానీ, ప‌ద్దు కానీ లేదు. ఇది పేద‌ల బ‌డ్జెట్ కాదు.. రైతుల బ‌డ్జెట్ కాదు.. ఎవ‌రి బ‌డ్జెటో రేపు మీకు విశ్లేష‌ణ‌లో తెలుస్త‌ది. భ‌విష్య‌త్‌లో బ్ర‌హ్మాండంగా చీల్చి చెండాడ‌బోతాం అని కేసీఆర్ తేల్చిచెప్పారు.