కలెక్టర్ గారు..దండం పెడతాం

తుంగతుర్తి జులై 26 (జనం సాక్షి)
మా స్కూలుకు పంతులును ఇవ్వరా
వేడుకుంటున్న విద్యార్థులుకలెక్టర్ గారు మీకు దండం పెడతాం… మాది అసలే మారుమూల తండా మా స్కూలుకు పంతులు రావడం లేదు. దీంతో మేము చదువుకు దూరం అవుతున్నాం అంటూ విద్యార్థులు కలెక్టర్ ను రెండు చేతులెత్తి వేడుకుంటున్నారు ఇది ఎక్కడో కాదు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని జేత్య తండా పరిస్థితి శుక్రవారం జనం సాక్షి ప్రతినిధి తండాకు వెళ్లి పరిశీలించగా పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయుడు హాజరు కాకపోవడంతో విద్యార్థులు ఆడుకుంటున్న పరిస్థితి కనబడింది. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పాఠశాల ప్రారంభం నుండి నేటి వరకు విధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హాజరు కావడం లేదు .దీంతో తండాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసిన లాభం లేదని దీంతో తమ పిల్లలు చదువుకు దూరం కావాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అప్పుడప్పుడు ఎంఈఓ కార్యాలయంలో ఉన్న సి ఆర్ పి ని పాఠశాలకు పంపిన అట్టి సిఆర్పి సెలవు పెడితే అంతే సంగతులు గత మూడు రోజుల నుండి సిఆర్పి సెలవులో ఉండగా ప్రత్యామ్నాయంగా మరొక ఉపాధ్యాయుడిని కాంప్లెక్స్ హెడ్మాస్టర్ గాని ఎంఈఓ గాని పంపకపోవడంతో విద్యార్థులు ఒక్కరే హాజరై చదువు సంధ్యలు లేక ఇంటికి వెళుతున్నారు . ఈ విషయాన్ని అధికారులకు విన్నవించిన ఉపాధ్యాయుడునీ నియమించడంలో అధికారులు పూర్తిగా వైపల్యం చెందారని తండావాసులు ఆరోపిస్తున్నారు. మండలంలో ఇప్పటికే కొన్ని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్న పాఠశాలల నుండి ఒకరిని తమ పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపి తమ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు..