అభివృద్ది పనులపై ఎమ్మేల్యే సమీక్ష

నిర్మల్‌ టౌన్‌: నియోజకవర్గంలోని పలు అభివృద్ది పనులపై ఎమ్మేల్యే మహేశ్వరరెడ్డి బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగంచేసుకొని అభివృద్దికి సహకరించాలని కోరారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కోన్నారు.