అభివృద్ది విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు
– జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ జనం సాక్షి, మంథని : అభివృద్ది విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. మంథని మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు ఉస్మాన్‌పూరలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పర్యటించారు. ఈ సందర్బంగా వార్డులోని ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పటు తర్వాత అభివృద్ది అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నా మన్నారు. అనేక ఏండ్లు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసిన నాయకులకు ఉస్మాన్‌పుర కన్పించలేదని, నిత్యం ఈ వార్డు ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొనే వారని ఆయన గుర్తు చేశారు. మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ప్రత్యేక చొరవ తీసుకుని ఉస్మాన్‌పుర రూపు రేఖలు మార్చిందని, ఈనాడు ఈ వార్డు ప్రజలు పట్టణ నడిబొడ్డున ఉన్న వాతావరణంలో జీవిస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి అభివృద్ది ఏనాడు జరుగలేదని, మంథనిని మరింత అభివృధ్ది పథంలో ముందుకు తీసుకెళ్లి ఆదర్శంగా నిలుపుతామని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా వార్డులో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.