అమెరికాలో రాష్ట్రానికి చెందిన ఓ స్టాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మృతి

న్యూయార్క్‌: అమెరికాలో రాష్ట్రానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మృతి చెందాడు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన పడపాటి రాజా చౌదరి (25) న్యూయార్క్‌లో ఓ కంపెనీలో గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నాడు. నిన్న సహచరులతో ఈతకు వెళ్లి చనిపోయాడు. చౌదరి మరణవార్తతో అద్దంకిలోని అతని నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.