అమెరికా గజగజ
– జాతి వివక్షపై భగ్గుమన్న నల్లజాతీయులు
– ఐదుగురు పోలీసుల మృతి
డల్లాస్,జులై 8(జనంసాక్షి): కాల్పుల ఘటనలతో అమెరికా మరోమారు రక్తసిక్తమైంది. తాజాదాడుల్లో పోలీసులు మృతి చెందారు. రెండు రోజుల్లో ఇద్దరు నల్లజాతీయులను పోలీసులు కాల్చి చంపడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ హత్యలకు నిరసనగా నల్లజాతీయులు డల్లాస్‌లో ఆందోళనకు దిగారు. ర్యాలీలతో తమ నిరసన వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా పోలీసులపైకి కాల్పులు జరపడంతో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ర్యాలీలో బాంబులు పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాంబుల అనుమానంతో డల్లాస్‌కు విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే దుండగులు కాల్పులకు తెగబడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంతమందిని వీలైతే అంతమందిని అధికారులను చంపడమే లక్ష్యంగా కాల్పులు జరిపినట్టు కనిపిస్తోందని పోలీస్ చీఫ్ డేవిడ్ బ్రౌన్ పేర్కొన్నారు. పోలీసులపై కాల్పులకు దిగిన దుండగులతో చర్చలు కొనసాగుతున్నాయి. సుమారు ముగ్గరు అనుమానితులు లొంగిపోయారు. ఓ స్నైపర్‌తో పోలీసులు చర్చిస్తున్నట్లు డల్లాస్ చీఫ్ డేవిడ్ బ్రౌన్ తెలిపారు. డల్లాస్‌లో మరికొంత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆ అనుమానితుడు వార్నింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. డల్లాస్ డౌన్‌టౌన్‌లో పలు చోట్ల బాంబులు పెట్టినట్లు అతను పేర్కొన్నాడు. స్నైపర్లు చేసిన దాడిలో మృతిచెందన పోలీసుల సంఖ్య అయిదుకు చేరుకుంది. కాల్పుల్లో 11 మంది పోలీసులు గాయపడ్డారు. నల్లజాతీయులపై జరిగిన దాడులకు నిరసనగా జరిగిన ఆందోళనలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈసారి జరిగిన హింసలో ఏకంగా పోలీసులే బలయ్యారు. డల్లాస్‌లో స్నైపర్లు బరితెగించారు. అమెరికా పోలీసులను టార్గెట్ చేశారు. ఆ కాల్పుల్లో నలుగురు పోలీసులు చనిపోయారు. మొత్తం 11 మంది పోలీసులను స్నైపర్లు షూట్ చేశారు. ఇటీవల అమెరికాలో నల్లజాతీయలపై వరుస దాడులు జరిగాయి. మిన్నసొట్టా, లూసియానాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు నల్లజాతీయులు మృత్యువాతపడ్డారు. ఆ కాల్పులకు నిరసనగా డల్లాస్‌లో భారీ ఆందోళన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో భారీ హింస చోటుచేసుకున్నది. ర్యాలీ తీస్తున్న ఆందోళనకారులు పోలీసుల పైరిరగ్‌తో చెల్లాచెదురయ్యారు. ఈ దశలో స్నైపర్లు పోలీసులను టార్గెట్ చేశారు. రహస్య స్థావరాల నుంచి దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. మొత్తం 11 మంది పోలీసులకు తూటాలు దిగగా, అందులో నలుగురు ప్రాణాలు విడిచారు.
పోలీసులను కాల్చి చంపిన వాళ్ల కోసం తీవ్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడిచిన వారం మిన్నసొట్టాలో ఫిలాండో కాసిల్, లూసియానాలో ఆల్టన్ స్టిర్లింట్ అనే నల్లజాతీయులు పోలీసుల తూటాలకు ప్రాణాలు విడిచారు. ఆ కాల్పులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఆఫ్రికా-అమెరికా జాతికి చెందిన ప్రజలపై స్థానిక పోలీసులు అనేక సందర్భాల్లో బలప్రయోగం ప్రదర్శిస్తున్నారు. అయితే ఇద్దరు నల్లజాతీయులను కాల్చి చంపిన సంఘటనకు సంబంధించిన వీడియోలను ఆందోళనకారులు రిలీజ్ చేశారు. దాంతో దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్లు దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. నల్లజాతీయులను శ్వేతజాతి పోలీసులే టార్గెట్ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపైన ఒబామా స్పందించారు. పోలీస్ శాఖలో జాతివివక్ష భేదాలు సమసిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం చర్మ వర్ణం కారణంగానే నల్లజాతీయులను వేరు చేస్తే అది వాళ్లను బాధిస్తుందని ఒబామా అన్నారు. డాల్లస్ లో కాల్పులకు దిగిన స్నైపర్ల ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు.