అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.


ఫొటో : అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న సీఐ శంకరయ్య.
బెల్లంపల్లి, మార్చి 12, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద బుధవారం అమ్మఒడి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి బాధను తగ్గించడానికి తమ వంతు సాయంగా అన్నదానం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. పేరు చెప్పుకోవడడానికి ఇష్ట పడని, గుప్త దాత, గొర్ల శ్రీనివాస్ 25 కిలోల బియ్యం, ఇనుకొండ రమాదేవి – ప్రసాద్ దంపతులు రూ. 1116/-, ఎండీ ముస్తఫా రూ, 1000/-, ఆర్ఎంపీ దశరథం కూరగాయలు, సబ్బని నరేష్ రూ. 500/-, మరాఠి నవీన్ రూ. 500/- సహకారంతో 174వ సారి అన్నదానం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లేటూరి బస్టాండ్ నందు యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేశామన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు ఈరోజు దాతలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా పట్టణ సీఐ శంకరయ్య పాల్గొని అమ్మఒడి సభ్యులను అభినందించారు. ఈకార్యక్రమంలో అమ్మ ఒడి సభ్యులు గన్నెవరం తిరుమల చారి, లెంకల శ్రావణ్ కుమార్, బియ్యాల ఉపేందర్, సిద్దమల్ల రఘు, మేదరి రవి, ఎండి యూసుఫ్, చందుపట్ల లింగన్న పాల్గొన్నారు.