యువకుడిపై కర్రలతో దాడి.. పరిస్థితి విషమం

 దోమ (జనంసాక్షి) : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో ఓ యువకుడిపై కర్రలతో దాడి చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. గునిగరి శ్రీనివాస్ ఆర్మీ, తమ్ముడు నర్సిములు ఇద్దరు కలిసి బైండ్ల గోపాల్ ఇంటి దగ్గరికి వెళ్ళారు. అతన్ని బయటకు తీసుకుని వచ్చి రోడ్డుపైకి రాగానే శ్రీనివాస్, నర్సిములు ఇద్దరు కలిసి కర్రలతో బాగా కొట్టారు. నెత్తిపైన గట్టిగా తగలడంతో స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో యువకుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.