కోట్ల సంవత్సరాల క్రితం.. నడయాడిన డైనోసార్లు!
` మంచిర్యాల మట్టి గడ్డపై చెరగని పాదముద్రలు
` 14 భారీ పాదముద్రలు G సుమారు 50 చిన్న పాదముద్రలు
` సుమారు 20 కోట్ల ఏళ్ల నాటి ఆనవాళ్లు
` మంచిర్యాల జిల్లాలో డైనోసార్ల అవశేషాలు
` శిలాజాలను మంచిర్యాల జిల్లాకు తరలించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
పింగిళి సంపత్ రెడ్డి (మంచిర్యాల ప్రతినిధి, జనంసాక్షి)
ప్రాణహిత నది పరవళ్లు.. పచ్చని అటవీ అందాలు.. చారిత్రక కట్టడాలు.. కోట్ల సంవత్సరాల నాటి జీవుల ఆనవాళ్లు.. ఇలా ప్రకృతి, చరిత్ర, భౌగోళిక విశేషాలకు నిలయంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లి ప్రాంతం నిలుస్తోంది. ముఖ్యంగా రాజారాం, సుంపుటం, ఒడ్డుగూడెం తదితర ప్రాంతాల్లో లభించిన డైనోసార్, వృక్ష శిలాజాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.వేమనపల్లి మండలం రాజారాం గ్రామ సవిÖపంలోని అటవీ ప్రాంతంలో శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలు ఈ ప్రాంతంలో కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ల ఉనికికి ఆధారాలను వెలుగులోకి తెచ్చాయి. రాళ్లపై కనిపించిన భారీ పాదముద్రలు, తవ్వకాల్లో లభించిన ఎముకలు తదితర అవశేషాలు అప్పటి జీవ వైవిధ్యాన్ని తెలియజేస్తున్నాయి. ప్రాణహిత?గోదావరి లోయలోని ఈ ప్రాంతం డైనోసార్ల పరిశోధనకు ముఖ్యమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది.రాజారాం సవిÖపంలో లభించిన డైనోసార్ అవశేషాల్లో సుమారు 14 విÖటర్ల పొడవున్న కోటాసారస్ యామనపల్లియెన్సిస్‌కు సంబంధించిన అస్థిపంజరం కూడా ఉంది. ఈ డైనోసార్ శాకాహారి జాతికి చెందినదిగా శాస్తీయ పరిశోధనల్లో గుర్తించారు. దాని అసలు అస్థిపంజరాన్ని హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్ డైనోరియంలో ప్రదర్శనకు ఉంచారు.
వృక్ష శిలాజాలకు నిలయం
వేమనపల్లి మండలంలోని సుంపుటం, ఒడ్డుగూడెం, వేమనపల్లి పరిసరాల్లో వృక్ష శిలాజాలు కూడా కనిపిస్తున్నాయి. వాగులు, వంకలు, భూభాగంలోని రాతి పొరల్లో పురాతన వృక్ష అవశేషాలు శిలాజాలుగా మారిన ఆనవాళ్లు గుర్తించబడ్డాయి. జీవుల అవశేషాలు మట్టి పొరల్లో దీర్ఘకాలం భద్రపడి, భూగర్భ ప్రక్రియల కారణంగా ఖనిజాలతో నిండిపోయి రాతి స్వరూపాన్ని సంతరించుకోవడమే శిలాజీకరణ.డైనోసార్లకు సంబంధించిన శిలాజాల్లో ఎముకలు, పుర్రెలు, దంతాలు మాత్రమే కాకుండా పాదముద్రలు, నడిచిన ఆనవాళ్లు వంటి జాడ శిలాజాలు కూడా ఉంటాయి. వేమనపల్లి ప్రాంతంలో లభించిన పాదముద్రలు అప్పటి డైనోసార్ల సంచారాన్ని అర్థం చేసుకోవడానికి కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయి.
కోట్ల సంవత్సరాల నాటి జీవ వైవిధ్యానికి ఆధారాలు
ప్రాణహిత?గోదావరి లోయలో తెలంగాణలోని మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల పరిధిలో కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ అవశేషాలు వెలుగుచూశాయి. శాకాహార, మాంసాహార డైనోసార్ జాతులకు సంబంధించిన ఆధారాలు ఈ ప్రాంతంలో లభించడం శాస్త్రవేత్తల పరిశోధనలకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. మరోవైపు వేమనపల్లి మండలం రాజారాం గ్రామంలో లభించే చారిత్రక శిల్పాలు, దశావతారాల విగ్రహాలు ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకతను చేకూరుస్తున్నాయి. కాకతీయుల కాలానికి చెందినవిగా స్థానికంగా పేర్కొంటున్న ఈ విగ్రహాలు చారిత్రక ప్రాధాన్యతను చాటుతున్నాయి.
మÖ్యజియం ఏర్పాటుపై డిమాండ్
వేమనపల్లి ప్రాంతంలో లభిస్తున్న డైనోసార్, వృక్ష శిలాజాలను స్థానికంగానే భద్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలో ప్రత్యేక శిలాజ మÖ్యజియం ఏర్పాటు చేస్తే తెలంగాణలోని పురాతన జీవ, భౌగోళిక సంపదను పరిరక్షించడంతో పాటు పర్యాటకంగా కూడా వేమనపల్లికి మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది. కోట్ల సంవత్సరాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన శిలాజ సంపదను కాపాడాల్సిన అవసరం ఉంది.
రాజారాం గ్రామ అటవీ ప్రాంత తవ్వకాల్లో..
మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండల కేంద్రానికి అతి సవిÖపంలో ఉన్న రాజారాం గ్రామ సవిÖపంలో అటవీ ప్రాంతంలో జురాసిక్ యుగానికి చెందిన రెండు వేర్వేరు రకాల రాకాసి బల్లులు (డైనోసార్స్)తిరిగినట్లు శాస్త్రవేత్తలు పాదముద్రల ఆధారాలు గుర్తించినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన అడుగుజాడలు రాళ్లపై స్పష్టమైన పాద ముద్రలుగా ఉన్నాయని ఉన్నాయని చారిత్రక ఆధారాలు చూపుతున్నాయి. వేమనపల్లి మండలం రాజారాం , కోటపల్లి ప్రాంతాలలో రాళ్లపై ముద్రితమైన డైనోసార్ల భారీ పాద ముద్రలు కూడా కనుగొనబడ్డాయి. దీని ఆధారంగా ఇవి ఆ కాలంలో ఎలా సంచరించబడ్డయో తెలియజేస్తున్నాయి. రాజారాం గ్రామ అటవీ ప్రాంతంలో 1974 నుండి 84 వరకు మధ్యకాలంలో శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటి శాకాహార డైనోసార్ విశేషాలు లభించాయి. ఇక్కడ 12 డైనోసార్లకు సంబంధించిన 840 డైనోసార్లు ఎముకలు ముక్కలను సేకరించినట్టు సమాచారం.
డైనోసార్లు ఎన్ని రకాలు?
శాఖాహార డైనోసార్లు : ఆకులు, మొక్కలు, వృక్షాలను ఆహారంగా తీసుకునేవి.
ఉదా : బ్రాకియోసారస్, డిప్లోడోకస్, ట్రైసెరాటాప్స్
మాంసాహార డైనోసార్లు : ఇతర జంతువులను వేటాడి ఆహారంగా తీసుకునేవి
ఉదా : టైరానోసారస్ రెక్స్, వెలోసిరాప్టర్, అల్లోసారస్
మొత్తం గుర్తించిన జాతులు : ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,000కు పైగా డైనోసార్ జాతులు శాస్త్రవేత్తలు గుర్తించారు.
కొత్త శిలాజాల పరిశోధనతో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది.
మంచిర్యాల జిల్లాలో డైనోసార్ల సంచారానికి కీలక ఆధారాలు వెలుగుచూశాయి. సలిగావ్ పరిసరాల్లోని రాతిపొరలపై డైనోసార్ల పాదముద్రలు (ట్రాక్‌వేలు) గుర్తించారు. వేమనపల్లి ప్రాణహిత తీరంలో డైనోసార్ శిలాజాలతో పాటు, కోటపల్లి మండలం బొప్పారంలో సుమారు 230 మిలియన్ ఏళ్ల నాటి వృక్ష, జంతు శిలాజాలు లభించాయి. వేమనపల్లిలో గతంలో కోటసారస్ శిలాజాలను గుర్తించారు. తాజా పాదముద్రలు శాఖాహార సారోపాడ్, మాంసాహార థెరోపాడ్ డైనోసార్ల ఉనికికి ఆధారాలుగా నిలుస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.


