మహబూబ్‌నగర్ జిల్లా రిజిస్ట్రార్‌గా పెరిపాక దీపక్

మహబూబ్‌నగర్,ప్రతి నిది అక్టోబర్ 05 (జనం సాక్షి): మహబూబ్‌నగర్ జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ జిల్లా రిజిస్ట్రార్‌గా పెరిపాక దీపక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.అంతకుముందు జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేసిన డి. ఫణీందర్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో పెరిపాక దీపక్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం దీపక్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శక సేవలు అందించడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రికార్డుల నిర్వహణ, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.



