అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.
ఫొటో : అన్నదానం చేస్తున్న అమ్మఒడి సభ్యులు.
బెల్లంపల్లి, మార్చి 26, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి బాధను తగ్గించడానికి తమ వంతు సాయంగా అన్నదానం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. నల్ల రాజేందర్ – సంధ్య దంపతుల పెళ్లిరోజు మరియు వారి పెద్ద కుమారుడు నల్ల ఆదిత్య జన్మదినం సందర్బంగా నెన్నెల సహకారంతో 176వ సారి అన్నదానం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లేటూరి బస్టాండ్ నందు యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేశామన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు ఈరోజు దాతలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు నల్ల రాజేందర్, సంధ్య, నల్ల ఆదిత్య, కుశన సాయికుమార్, అమ్మ ఒడి సభ్యులు హనుమండ్ల సువర్ణ, గన్నెవరం తిరుమల చారి, రంగ సురేష్, లెంకల శ్రావణ్ కుమార్, రొడ్డ హరీష్, బియ్యాల ఉపేందర్, సిద్దమల్ల రఘు, మేదరి రవి, బాలు, ఎండీ ముస్తఫా, ఎండి యూసుఫ్, చందుపట్ల లింగన్న, కామెర శివ పాల్గొన్నారు.