అమ్మా బైలెల్లినాదో…

లష్కరె బోనాలు షురూ !
హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి):
లష్కరే బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే బోనాలను తీసుకుని మహిళలు పెద్ద సంఖ్యలో ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రులు సి.రామచంద్రయ్య, గీతారెడ్డి, ఎంపిలు అంజన్‌కుమార్‌యాదవ్‌, వివేక్‌, ఎమ్మెల్యే జయసుధ, టీడీపీ సీనియర్‌ నేత తలసాని శ్రీనివాసయాదవ్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు సమర్పించారు. ఉజ్జయిని మహం కాళి ఆలయం పరిసర ప్రాంతాలు జనసం దోహంతో కిటకిటలాడుతుంది. అమ్మా.. దీవించమ్మా.. తల్లీ.. కరుణించమ్మ అనే స్మరణతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.