అయ్యప్ప గుడిలో లలితాసహస్రనామ పారాయణం

మంథనిటౌన్‌ జూలై 11 (జనంసాక్షి)
కోటి లలితసహస్త్రనామ పారాయణలో భాగంగా మంథని పట్టణంలోని అయ్యప్పగుడిలో బుధవారం కోటి లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. మంథని పట్టణంలోని అన్ని దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అయ్యప్ప స్వామి గుడిలో సావిత్రి టిచర్‌ ఆధ్వర్యంలో లలితలందరు ఉదయం 6 గంటలకు గుడికి వెళ్లి ఈలలితసహస్రనామ పారాయణ పఠనాన్ని చేపట్టారు అలాగే గుడిలో అన్నాదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సావ్నిత్రి టిచర్‌ మాట్లాడుతు లోక కళ్యాణం కోసం యావత్‌ ప్రపంచం సుఖశాంతిలతో ఉండాలని విధివైపరిత్యాలు, భూకంపాలు, ప్రమాదాలు, వరదలు, అదిపత్యపోరు, అతివృష్టి అనావృష్టితో జరిగే నష్టాలు స్తంభవించకుండా సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమవృద్ధిగా పండి సర్వేజన సుఖినోభవంత్‌ అనే విధంగా ప్రపంచా మానవళి పిల్లపాపలతో సుఖంగా ఉండాలని భగవంతున్ని ప్రసన్నం చేసేందుకు ఈ లలిత సహస్త్ర నామక కార్యక్రమాన్ని చెపట్టమాని భగవంతుడు ప్రసన్నమై అందరిని చల్లగా చూడాలని ఆమె అన్నారు. అలాగే గుడి నిర్వహుకులు కోమువెళ్లి విజయ్‌కుమార్‌, మాజీ సర్పంచ్‌ ఓడ్నాల శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు సింగారపు కిష్టయ్య, రాచర్ల నాగభూషణం, కొంతం రమేష్‌లతో పాటు వారి సతీమణిలు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.