అరగంటలో హైదరాబాద్‌ అల్లకల్లోలం

C

అంధకారంలో రాజధాని

కూలిన భారీ వృక్షాలు,హోర్డింగులు

ధ్వంసమైన వందలాది కార్లు, ద్విచక్రవాహనాలు

సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎస్‌, జీహెచ్‌ఎంసీ దళాలు

ఇద్దరి మృతి

పలుకాలనీల జలమయం

హైదరాబాద్‌,మే20(జనంసాక్షి):అరగంట… కేవలం అరగంట సమ యంలోనే భాగ్యనగరం అల్లాడిపోయింది. శుక్రవారం సాయంత్రం గాలిదు మారం, భారీవర్షం నగరాన్ని అతలాకుతలం చేశాయి. నేలకొరిగిన వృక్షాలు, ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు, కూలిన ¬ర్డింగ్‌లు, చిరిగిన ఫ్లెక్సీలు… అర గంట విధ్వంసం తర్వాత నగరంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యా లివి.సాధారణ వర్షానికే నగరంలోని రోడ్లు జలమయం కావడం చూస్తూనే ఉంటాం. కానీ శుక్రవారం సాయంత్రం వరుణుడికి వాయువు తోడై భాగ్యన గరాన్ని వణికించారు. రోడ్లపై నుంచి వర్షపు నీరు పొంగి ప్రవహించగా… చె ట్లు, విద్యుత్‌ స్తంభాలు రహదారులపై పడి తుపాను విధ్వంసాన్ని తలపిం చాయి. ఈ ప్రకృతి ప్రకోపంతో నగరంలోని ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. గంటల తరబడి వాహనాలు కదల వాహనదారులు నరక యా తన అనుభవించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాలు వాహన రాకప ోకల ను పునరుద్ధరించేందుకు సహాయచర్యలు చేపట్టారు. నగర మేయర్‌ సైతం సహాయచర్యల్లో పాల్గొన్నారు.జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి ఈదురుగాలులు తోడు కావడంతో పలు ప్రాంతాల్లో భారీవృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.క్యుములోనింబస్‌ మేఘాల కారణంగానే హైదరాబాద్‌లో వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘రోను’ తుపాను నగరంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని స్పష్టం చేసింది. అకస్మాత్తుగా ప్రారంభమైన వర్షంలో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుకు వెళ్లే మార్గంలో ఓ భారీ ¬ర్డింగ్‌ విరిగిపడి 8కార్లు ధ్వంసమయ్యాయి.

హైదరాబాద్‌లో గాలి వాన బీభత్సం ..

భగ్యనగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. రాజధాని హైదరాబాద్‌లో నిమిషాల వ్యవధిలోనే వాతావరణం మారిపోయింది. పెళపెళమంటూ ఉరుములు , భీకర మెరుపులు జడిపించాయి. గంటపాటు జోరువాన దంచికొట్టింది. ఈదురు గాలులు ¬రెత్తించాయి. బంజారాహిల్స్‌, జూబ్లీ హిల్స్‌, పంజాగుట్ట, ఎస్సార్‌ నగర్‌, లక్డీకపూల్‌, చింతల్‌, జీడిమెట్ల, కూకట్‌ పల్లి , ఉప్పల్‌ సహా నగరమంతా వాన కురిసింది. చెట్లు విరిగిపడ్డాయి.జూబ్లీ హిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ¬ర్డింగ్‌ కూలడంతో.. భారీగా ట్రాఫిక్‌ జామైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పిడుగుపాటుకు పలు చెట్లు తగలబడ్డాయి. అటు.. వాన వెలవడంతో.. జీహెచ్‌ఎంసీ యాక్షన్‌ టీంలు రంగంలోకి దిగాయి. కూలిన చెట్లు, ¬ర్డింగ్‌లను క్లియర్‌ చేస్తున్నారు. వీలైనంత త్వరగా రోడ్లు క్లియర్‌ చేసేందుకు పనిచేస్తున్నారు.

ఈదురు గాలుల ధాటికి నేలకొరిగిన ¬ర్డింగులు

ఈదురు గాలుల ధాటికి పెద్ద ¬ర్డింగులు నేల కూలాయి. భారీ వృక్షాలు నెలమట్టమయ్యాయి. చెట్లు విరిగి రోడ్లపై కూలడంతో.. నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామైంది. కిలోవిూటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. జూబ్లిచెక్‌ పోస్ట్‌ వద్ద మెగా ¬ర్డింగ్‌ కూలి వాహనాలపై పడటంతో? వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ దిశగా రోడ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో వేగవంతమైన గాలులతో జల్లులు పడ్డాయి. ఈదురు గాలుల దాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.నగరంలో హఠాత్తుగా కురిసిన ఈదురుగాలుతో కూడిన వర్షానికి పలు చోట్ల ¬ర్డింగులు కూలిపోయాయి. ఈదురుగాలులతో వచ్చిన వర్షం ధాటికి ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద ఓ ¬ర్డింగ్‌ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ¬ర్డింగ్‌ కిందున్న కార్లు ధ్వంసమయ్యాయి.నగరంలోని జీడిమెట్ల, కుత్భుల్లాపూర్‌, చింతల్‌, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, నేరేడ్‌మెట్‌, మాదాపూర్‌, అవిూర్‌పేట, అంబర్‌పేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్‌ పరిధిలోని బేగంపేట, బోయిన్‌పల్లి, అడ్డగుట్ట ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. ఈదురుగాలుల భీభత్సానికి పలుచోట్ల చెట్టు విరిగి రోడ్డుపై పడిపోయాయి.పాతబస్తీ భవానినగర్‌ పీఎస్‌ పరిధిలోని జహంగీర్‌నగర్‌లో ఇవాళ సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. హఠాత్తుగా ఈదురుగాలులు రావడంతో ఓ బిల్డింగ్‌ పైనున్న సింటెక్స్‌ వాటర్‌ ట్యాంక్‌ ఎగిరిపోయి పక్కనే ఉన్న ఇంటిపై పడింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఒకరు మృతి చెందగా..మరొకరికి గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌ నగరం లో వీచిన భారీ గాలులు మరియు వర్షం కారణం గా ఫిలింనగర్‌, బంజారహిల్స్‌, జూబ్లీహిల్స్‌, సైఫాబాద్‌, మెహదిపట్నం, అవిూర్‌ పేట్‌, ఎర్రగడ్డ, నారాయణగూడ, సైదాబాద్‌, హయత్‌ నగర్‌, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో చెట్లు భారీ ¬ర్డింగ్‌ లు కూలిపోయాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్‌ సరఫరా నిలిపి వేయటం జరిగిందని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు.ఎక్కడైనా రోడ్ల విూద, చెట్ల విూద విద్యుత్‌ తీగలు, స్తంభాలు క్రింద పడి వుంటే వాటిని తాకకుండా దూరంగా ఉండాలిని హెచ్చరించారు. ఇప్పటికే సిబ్బంది విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ చర్యల్లో వున్నారని తెలిపారు. విూ ప్రాంతంలో ఏదన్న సమస్య వుంటే 100 నెంబర్‌ కి గాని 040-21111111 కు గాని తెలియ జేయాలని టీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శ్రీ జి.రఘుమా రెడ్డి సూచించారు.జీహెచ్‌ఎంసీలో ఏర్పాటుచేసిన అత్యవసర కంట్రోల్‌ రూమ్‌ మూడు షిఫ్టుల్లో నిరంతరం పనిచేస్తుందని అధికారులు తెలిపారు. బాధితులు ఫోన్‌ చేయాల్సిన టోల్‌ ఫ్రీ నెంబర్లు- 100, అలాగే 040- 21 11 11 11, 155304. ఈ మూడు నెంబర్లపై గాలివాన వల్ల తలెత్తిన ఇబ్బందులపై ఈ నెంబర్లకు ఫోన్‌ చేయాలని అధికారులు కోరారు.