ఆర్టీసీ బస్సు… లారీ ఢీకొని 15 మందికి గాయాలు

సదాశివపేట ఫిబ్రవరి 28(జనం సాక్షి)సదాశివపేట జాతీయ రహదారి 65 పై బైపాస్ రోడ్డులోని మూలమలుపు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్ నుంచి సదాశివపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్ లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.



