అర్థరాత్రి కారుబీభత్సం: ఒకరు మృతి
హైదరాబాద్,ఆగస్ట్15(జనం సాక్షి): నగర శివారు వనస్థలిపురం ఆటోనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పుట్‌పాత్ విూదున్న ఓ షాప్‌లోకి కారు దూసుకెళ్లడంతో భరత్ (34)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు నడిపిన యువకులు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హయత్‌నగర్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగి సంతోష్‌రెడ్డి, బీటెక్ విద్యార్థి రషీద్.. ఇద్దరు అర్ధరాత్రి వనస్థలిపురం నుండి హయత్‌నగర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకునీది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన భరత్‌తో పాటు గాయపడిన ఇద్దరిని రాజస్థాన్‌కు చెందినవారుగా గుర్తించారు.


