అర్హులకు పట్టాలివ్వాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా

పెద్దపల్లి : పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో ప్రభుత్వ భూములను అనర్హులకు అక్రమ పట్టాలు ఇవ్వటాన్ని నిరసిస్తూ గ్రామస్థులు పెద్దపల్లి ఎమ్మార్వో కార్యలయం ముందు ధర్నా చేశారు. అర్హులైన వారిని గుర్తించి తిరిగి పట్టాలివ్వాలని వారు ఎమ్మార్వో చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు. అక్రమ పట్టాలలో చేతి వాటం చూపిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.