అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ బీఆర్‌ఎస్‌

` బీజేపీ సర్కారు వచ్చిన వెంటనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోచుకున్న సొమ్మును కక్కిస్తాం
` బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా
బోధన్‌,బిచ్కుంద(జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ సర్కారు వచ్చిన వెంటనే టిఆర్‌ఎస్‌ అవినీతిపై విచారణ చేపడతామని బోధన్‌ చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా స్పష్టం చేశారు. సోమవారంలో బోధన్‌ చెక్కర ఫ్యాక్టరీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ, కెసిఆర్‌ సర్కారు వచ్చిన తర్వాత కుటుంబ పాలనగా రాష్ట్రం ఏర్పడిరదని ఈ మేరకు సహకారం వచ్చిన వెంటనే విచారణ జరుపుతామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ముఖ్యమైన శాఖలు కేసీఆర్‌ కుటుంబ పరిధిలోనే ఉన్నాయని,  బిఆర్‌ఎస్‌ సర్కారు అవినీతి అధికంగా మారిందన్నారు. బిజెపి పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో  తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఈ మేరకు బోధన్‌ బిజెపి అభ్యర్థి వడ్డీ మోహన్‌ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని జేపీ నడ్డా కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్‌ రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షులు బసవ లక్ష్మీ నారాయణ, నరసింహారెడ్డి, సుధాకర్‌ చారి, కొలిపాక బాలరాజు, కోల ఇంద్రకరణ్‌, మనోహర్‌, ప్రవీణ్‌ తో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోచుకున్న సొమ్మును కక్కిస్తాం
బిచ్కుంద: బీఆర్‌ఎస్‌ అవినీతికి పాల్పడిరదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్‌ నియోజకవర్గంలో గల మద్నూర్‌ మండలంలో బీజేపీ అభ్యర్థి అరుణ తారాకి మద్దతుగా నిర్వహించిన సభలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఏం పనులు చేసినా కవిూషన్ల కోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తమని గెలిపిస్తే అమలు చేసే హావిూలను వివరించారు. కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండు అవినీతి పార్టీలేనని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్‌ విఫలమయ్యిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కుటుంబపాలన నడుస్తోందని, కల్వకుంట్ల కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను తీర్చలేకపోయారన్నారు. పేదలకు డబులూ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. గత ఎమ్మెల్యేగా పని చేసిన అరుణ తారాకు గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాజపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.