ఆకలి-ఆయువు

పిల్లి ఒకటి
ఎలుక ఒకటి
ఇంట్లో ఒకటి
కలుగులో ఒకటి

ఆయువు కొరకు
ఆకలి కొరకు
ఒకరికి ఒకరు
జీవన పోరు

మకరం ఒకటి
మర్కటం ఒకటి
నీటిలో ఒకటి
చెట్టున ఒకటి

కుమతి ఒకటి
సుమతి ఒకటి
ఓడిందొకటి
గెలిచిందొకటి

పుట్టలో ఒకటి
బొరియలో ఒకటి
తెలియని వైరం
కలువని వైనం

మనిషికి మనిషి
నీటికి నాచు
దూరం దూరం
వైరం వైరం

తెలివికి కథలు
తెలివిగ  మసలు
పాపానీవు
బాబు నీవు

………………..
రేడియమ్
9291527757