చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం

భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండ
సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత వ్యవహరించాలి
చిన్నారులపై లైంగిక హింస కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తాం
సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్‌(జనంసాక్షి):చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నట్లు చెప్పారు. ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండిరచాలన్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ సూర్యకాంత్‌, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్‌, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.