ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తది: కేసీఆర్‌

కరీంనగర్‌: ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలల్లో తెలంగాణ వస్తదని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ మండలం సింగాపురంలో మాజీ ఎంపీ వడితెల రాజేశ్వరరావు ప్రథమ వర్థంతి సభకు  కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించిన వెంబడే ఉద్యమం ఆగిపోదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందే వరకూ ఉద్యమం కొనసాగుతదని ఆయన తేల్చిచెప్పారు. ఇట్పిటి వరకు సాగునీరు అందని 75 నియోజకవర్గాల కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలు సాగులోకి తెస్తామని పేర్కొన్నారు. సభలో ఎంపీలు వివేక్‌, పొన్నం ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌, డా. రాజయ్య, అరవిందరెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎంపీ వినోదక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.