ఆటో ఛార్జీల పెంపు

హైదరాబాద్‌: ఆటోఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1.6 కిలోమీటర్ల వరకు కనీసరుసుం రూ.16. ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.9 గా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ఛార్జీలు ఈ రోజు అర్ధరాత్రినుంచి అమల్లోకి వస్తాయి.