ఆపదలో ఉన్న వారికి అండగా మనోహనర్ రెడ్డి

ఆపదలో ఉన్న వారికి డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అండగా ఉంటారని మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ కుడుముల యాదయ్య అన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డుకు చెందిన గంగనోల్ల పద్మమ్మ అనారోగ్యంతో గురువారం ఉదయం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి పద్మమ్మ కుటుంబానికి సానుభూతి తెలిపారు. తక్షణ ఖర్చుల నిమిత్తం రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాల్ నగర్ రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్  :
24 పిఆర్ జి 02లో పద్మమ్మ కుటుంబీకులకు ఆర్థిక సహాయం చేస్తున్న బీఎంఆర్ అనుచరులు