ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి -బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): దేశ ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కొరకు పీఎం నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు అన్నారు.ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో ఆ వార్డ్ కౌన్సిలర్ సలిగంటి సరిత వీరేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్ ఆన్ లైన్ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రతి వ్యక్తికి సంవత్సరానికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు.పీఎం నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018లో ప్రారంభించినప్పటికీ సీఎం కేసీఆర్ తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించారని అన్నారు.1350 రకాల వైద్య చికిత్సలు ప్రైవేట్ , ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయించుకునే అవకాశం ఉందన్నారు.రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అర్హులైన నిరుపేదలు సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నారని విమర్శించారు.ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్యా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, పట్టణ అధ్యక్షులు ఎండీ అబిద్, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పల్సా మహాలక్ష్మి , రాష్ట్ర నాయకులు తుక్కని మన్మధ రెడ్డి, నాయకులు పల్సా మల్సూర్, ఫణి నాయుడు, మీర్ అక్బర్, సంధ్యాల సైదులు, బూర లక్ష్మణ్ , సలిగంటి గణేష్, వాంకుడోత్ శ్రీను, ధరావత్ వెంకన్న , కొప్పుల క్రాంతి రెడ్డి, రాజేష్, ప్రసాద్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.