ఆరు ఇసుకలారీలు సీజ్‌

నల్గొండ క్రైం: మూసీ నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు లారీలను సీజ్‌ చేశామని భూగర్భ ఖనిజ శాఖ ఎన్‌ఫోర్స్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం రాత్రి ఇసుక రవాణా చేస్తుండగా ఆరు లారీలను పట్టుకున్నామన్నారు. ఒక లారీ డ్రైవర్‌ తన డ్రైవర్‌ పై దాడి చేసి లారీతో సహ పరారయ్యాడు. అతని పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.