ఆరోగ్యశ్రీ అమలులో ప్రధమస్ధానంలో ‘తూర్పు’ డాక్టర్‌ పి.వెంకటబుద్ద

కాకినాడ, జూలై 24,: ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటి వరకు 30వేల మందికి సేవలు అందించి ప్రభుత్వ రంగంలో రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచిందని,ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి. వెంకటబుద్ద అన్నారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఉభయ గోదావరి జిల్లాలకు రిఫరల్‌ ఆసుపత్రిగా కాకినాడ ప్రభుత్వాసుపత్రి 3వేల మంది రోగులు అవుట్‌ పేషెంట్‌ సేవలు, 1500 మందికి ఇన్‌పేషెంట్‌ సేవలను అందిస్తుందన్నారు. రోగుల రద్దీకి అనుగుణంగా గత సంవత్సర కాలంలో ఆసుపత్రిలో పలు విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కొత్తగా మరో నలభై పడకలలతో చేపట్టిన లేబర్‌ రూమ్‌ విస్తరణ దాదాపు పూర్తయిందని,కేన్సర్‌ వార్డు విస్తరణ ద్వారా కెమోథెరపీ విభాగంలో ఇరవై పడకలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. న్యూరోసర్జరీ విస్తరణ వల్ల ఫ్లోర్‌బెడ్‌ల సమస్య తీరిందన్నారు. గత సంవత్సరం అల్ట్రాసౌండ్‌, కలర్‌డాప్లర్‌ రూమ్‌ ఏర్పాటుతో రేడియోలజీ విభాగాన్ని, ఆడియోమెట్రి రూమ్‌ ఏర్పాటు ద్వారా ఇఎన్‌టి విభాగాన్ని ఆధునీకరించామని, ఎస్‌టిడి ఒపి, కమిటీ హాల్‌ల ఆధునీకరణ,వృద్దులు, వికలాంగుల సౌకర్యం కోసం ప్రత్యేక ఓపి ప్రారంభించామన్నారు. గిరిజనులు, అనాధల కోసం చేపట్టిన రత్నబాయి బ్లాక్‌ నిర్మాణం పూర్తి కావచ్చిందన్నారు. అలాగే 30 మంది సర్జికల్‌ రోగులు, 15 మంది మెడికల్‌ రోగులకు వసతి కల్పించనున్న ఆరోగ్యశ్రీ వార్డు నిర్మాణం త్వరలో పూర్తయి అందుబాటులోకి రానుందన్నారు. ఓపి బ్లాకులో ఏర్పాటు చేసిన 10 ఏసి, 26 నాన్‌ ఏసి స్పెషల్‌ రూమ్‌లకు ప్రజల ఆదరణ, ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. జర్మనీకి చెందిన దాత డాక్టర్‌ డైక్‌మెన్‌ అందించిన 40లక్షల విరాళంతో ఎన్‌ఐసియు, ఆర్‌ఐసియులలో వెంటిలేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరో రెండు వెంటిలైటర్ల ఏర్పాటుకు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి ఎంఎం పళ్ళంరాజు నిధులు కల్పించారన్నారు. కొత్తగా నిర్మించిన సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించారన్నారు. 40 కోట్లతో టిబి వార్డు స్థలంలో జి ప్లస్‌-8 బ్లాకు, ప్రత్యేక మెటర్నిటీ బ్లాకు నిర్మాణాల మంజూరు కానుందన్నారు.వస్త్రాలను కొనుగోలు చేయాలని ఖచ్చితమైన నిబంధనలు పెట్టినా అవి ఈ నాటి వరకు అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్కో సంస్థకు రూ.10 కోట్లు బకాయిలు పడిందని చెప్పారు. ఇవన్నీ కారణాలు చేనేత రంగం నష్టాల బారిన పడటానికి ప్రధాన కారణంగా వివరించారు.