ఆరో కామన్వెల్త్‌ యూత్‌ పార్లమెంటు సదస్సు హైదరాబాదులో

హైదరాబాద్‌: భాత్యనగరం మరో ప్రపంచ స్థాయి సదస్సుకు వేదిక కానుంది. ఆరో కామన్వెల్త్‌ యూత్‌ పార్లమెంటు సదస్సు వచ్చే ఏడాది హైదరాబాదులో జరగనుంది. 54 దేశాలకు చెందిన ప్రతినిధులు దీనికి హాజరవుతారని జనవరి నెలాఖరుకల్లా తేదీలు ఖరారవుతాయని శాసనసభపతి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో ఈ సదస్సు జరిగే అవకాశాలున్నాయి. మూడు రోజుల కింద లండన్‌ వేదికగా జరిగిన ఐదో కామన్వెల్త్‌ యూత్‌ పార్లమెంట్‌ సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు మన దేశంలోని విశ్వవిద్యాలయాల ప్రతినిధులను కూడా సదస్సుకు ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు సభాపతి తెలిపారు. యువత, నిరుద్యోగం, ఉచిత విద్య అవసరం తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.