ఆర్టీసీబస్సు లారీ ఢీ,19 మందికి గాయాలు

రాజమండ్రి: రాజమండ్రి నగరంలోని ఓ దివాస్‌చెరువు వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో 19 మంది గాయపడ్డారు. విశాఖ నుండి రాజమండ్రి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డావరిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.