ఆర్టీసీ ఆధ్వర్యంలో సారంగపూర్ లో దివ్యంగుల కు బస్ పాస్ మేళా నిర్వహించారు.

share on facebook

నవంబర్ 21, సారంగాపూర్,జనం సాక్షి…,
అర్హులయిన 50 మంది దివ్యంగుల వద్ద దరఖాస్తులు తీసుకొని కంప్యూటర్ లో పొందపరచి కార్డులు అండ చేసారు.
మండలం లోని దివ్యంగులు వారి కుటుంబ సభ్యులు అందరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని,మన పిల్లలకు కూడా ఉచిత బస్ పాసులు ఇస్తున్నదని ఆర్టీసీని మనం అందరం ఆదరించాలని మండల ప్రజాపరిషద్ ప్రెసిడెంట్ శ్రీ అట్ల మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.
మేము మీ గ్రామానికి వచ్చి దివ్యంగుల కొరకు ఇలా మేళా నిర్వహించి పాసులు ఇవ్వడం మా విధిగా భావించి మీ సేవ చేయడానికి వచ్చాము.ఒకప్పుడు స్వర్ణ,సారంగపూర్ ఆంటీ ఆర్టీసీ బంగారు గనులు అని పిలిచే వారని మళ్ళి ఆ రోజులు రావాలని డిపో మేనేజర్ సాయన్నగారు పేర్కొన్నారు.కార్యక్రమంలో మండల ప్రజాపరిషద్ అధికారి సరోజ గారు దివ్యంగుల ఛైర్మెన్ రమేష్ రెడ్డి గారు,ఆర్టీసీ సిబ్బంది ఎల్.నర్సయ్య,డి.గంగన్న దివ్యంగులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.