ఆర్టీసీ కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ

హైదరాబాద్, మార్చి 31: భాగ్యనగరంలో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే అష్టకష్టాలు పడాలి. ఎక్కాక టికెట్టు తీసుకోవాలన్నా తిప్పలు తప్పవు. టికెట్టుకు సరిపడా చిల్లర లేదని ఒక్కోసారి కండక్టర్‌తో గొడవ కూడా పెట్టుకుంటారు. తరువాత కండక్టరే ఏదోలా సర్దుకుపోయి టికెట్టు ఇస్తాడు. ఇదంతా షరా మామూలే.. కానీ దీనికి భిన్నంగా తాజాగా ఆర్టీసీ బస్సులో  ఓ ఘటన జరిగింది. చిల్లరపై వివాదంతో ఓ మహిళ, ఏకంగా కండక్టర్‌ను చెప్పుతో కొట్టింది. ఈ ఘటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటనపై బాధిత కండక్టర్ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.