ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటే అరెస్టు చేస్తాం:మంత్రి శిద్ధా

ప్రకాశం:ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటే అరెస్టు చేస్తామని ఏపీ రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు హెచ్చరించారు. ఆయన ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ…. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక నుంచి 200 బస్సులు తెప్పిస్తున్నామని..,ఇప్పటికే అదనపు రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు.