ఆర్డివో ఆకాస్మిక తనిఖీ

 

 

 

 

*పెన్ పహాడ్ మార్చి 10 (జనం సాక్షి) :
మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆర్డీవో రాజేంద్ర కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కాగా కార్యాలయానికి ఇంఛార్జి ఎంపిడిఓ బాణాల శ్రీనివాస్, కొందరు సిబ్బంది సమయానికి కార్యాలయానికి రాకపోవడంతో కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపైన కార్యాలయానికి సమయానికి రావాలని లేదంటే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పంచాయతీ రికార్డులను, నర్సరీ, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల హాజరు పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ పాటించాలని తెలిపారు , ఆహార పదార్ధాలను పరిశీలించారు.తదనంతరం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శేషగిరిరావు, ఇంఛార్జి ఎంపిడిఓ బాణాల శ్రీనివాస్, ఇంఛార్జి ఎంపీఓ జానయ్య, ఏపిఓ రవి, అర్ఐ సుందరి మట్టయ్య, కార్యదర్శి చంద్రశేఖర్, అంగన్వాడీలు ఊర్మిళ, విజయ, సుజాత, తదితరులు పాల్గొన్నారు…