ఆలయ పాలక మండలిని, గ్రామ పెద్దలను సన్మానించిన ఎమ్మెల్యే
హుజూర్ నగర్ మార్చి 6 (జనంసాక్షి): హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డిరజిత దంపతులు అమరవరంలో లింగమంతుల స్వామి ఆలయం గట్టు జాతరను విజయవంతంగా నిర్వహించినందుకు గాను సోమవారం ఆలయపాలక మండలిని, గ్రామపెద్దలను శాలువాతో సన్మానించి అభినందించడం జరిగింది. ఈ
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ పాలక మండలి, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.