ఆసుపత్రి నుంచి అదృశ్యమైన శిశివు ఆచూకీ లభ్యం

గుంటూరు : జిల్లా సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి కోసం వచ్చిన మహిళ శిశువుకు జన్మనిచ్చింది. తెనాలి నుంచి చినరావూరుకు చెందిన వ్యక్తులు ఈ శిశువును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అర్థరాత్రి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అర్బన్‌ ఎస్పీ రవికృష్ణ శిశువు తల్లిదండ్రులకు అప్పగించారు.