ఆస్తుల వివరలు ప్రకటించిన చంద్రబాబు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన, కుటుంబ సభ్యుల ఆస్తుల ఆస్తులను ప్రకటిస్తున్నానని ఆయన ప్రకటించారు. ఏటా తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటిస్తున్నానని ఆయన తెలియజేశారు.  తాను  ఆస్తులు ప్రకటించిన తర్వాతే కేంద్ర మంత్రివర్గంలో చలనం  వచ్చిందన్న చంద్రబాబు, కొందరు రాజకీయాలను స్వార్థం కోసం వాడుకుని రూ. కోట్లు కూడబెడుతున్నారని ఆరోపించారు. అన్నాహజారే పార్టీ పెట్టి పరవతిని కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు.

ఆస్తుల వివరాలు

చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 31.97 లక్షలు

1985 నుంచి 1992 మధ్య నిర్మించిన ఇల్లు, కారు చంద్రబాబు పేరుమీద ఉన్నాయి

భార్య భువనేశ్వరరి పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.25 కోట్లు

కుమారుడు లోకేశ్‌ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.6.62 కోట్లు

కోడలు బ్రహ్మణి పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 2.09 కోట్లు