ఆ రోడ్డు పూర్తయితే,..

మేడిపల్లి: సాధారణంగా నక్సలైట్ల ఉనికి పూర్తిగా తగ్గాలంటే రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాలని ప్రభుత్వం భావించింది. అయితే మేడిపల్లి నుంచి చందుర్తి వరకు నిర్మించాల్సిన రహదారికి నిధుల కొరత పట్టి పీడిస్తోంది. మొరం పనులు పూర్తయినా వర్షాకాలం వచ్చిందంటే వాహనాలు నడిచే పరిస్థితి లేదు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే చందుర్తి మీదుగా వేములవాడ వరకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. రాష్ట్రంలో నియోజకవర్గ కేంద్రానికి నేరుగా అనుసందానం కాని మండలంగా మేడిపల్లి ఇప్పటికే రికార్డు పదిలం చేసుకుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే మేడిపల్లితో పాటు ఇతర మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వచ్చే నిధుల్లో అయినా మేడిపల్లికి ప్రధాన్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.