ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలపై రేపు తుది నిర్ణయం

హైదరబాద్‌: ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలపై రేపు తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కౌన్సిలింగ్‌ తేదిల ఖరారుపై రేపు ఉన్నతాధికారులు, యాజమాన్యాలతో మరోమారు భేటి అవుతామన్నారు. ఆగష్టు 6వ తేదినుంచి కౌన్సిలింగ్‌ ప్రారంభించే యోచనలో ఉన్నామన్నారు. ఫీజుల ఖరారుపై శాశ్వత పరిష్కారంకోసం కౌన్సిలింగ్‌లో జాప్యం జరిగిందన్నారు.