ఇంటర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఫలితాలలో

వాగ్దేవి కళాశాల విద్యార్థుల ప్రతిభ

వేములవాడ, జూన్‌ 16 (జనంసాక్షి) : శనివారం ప్రకటించిన ఇంటర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ రెండవ సంవత్సరం ఫలితాలలో వేములవాడ పట్టణంలోని వాగ్దేవి కళాశాలకు చెందిన విద్యార్థినిలు జి. భారతి, ఎన్‌. సౌజన్యలు తమ ప్రతిభను చాటారు. కళాశాలలో ఎంపిసి తెలుగు, ఇంగ్లీష్‌  మీడియం విభాగాలలో చదివిన  జి. భారతి, ఎన్‌. సౌజన్యలు  ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల అనంతరం ప్రకటించిన ఫలితాలలో 953, 953 మార్కులతో ే అత్యుత్తమ ప్రతిభ కనబరచి డివిజన్‌ టాపర్లుగా నిలిచారని కళాశాల యాజమాన్యం ప్రకటించింది.